Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ బొటానికల్ 
గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

తెలంగాణ బొటానికల్ 
గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

- Advertisement -

క్లార్కిఇండా ట్రాకోడెస్‌గా నిర్ధారణ
రాష్ట్రంలో తొలిసారి నమోదు
విషతుల్యమైన పుట్టగొడుగు.. 
తినరాదని నిపుణుల హెచ్చరిక
నవతెలంగాణ-జడ్చర్ల

​మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్‌ బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో అత్యంత అరుదైన క్లార్కిఇండా ట్రాకోడెస్‌ అనే అడవి పుట్టగొడుగును గార్డెన్ సమన్వ యకర్త డాక్టర్‌ బి.సదాశివయ్య గుర్తించారు. అగారికేసి కుటుం బానికి చెందిన ఈ పుట్టగొడుగు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. జీవవైవిధ్య పరిశోధనలో భాగంగా నిర్వహించిన పరిశీలనల్లో ఈ పుట్టగొడుగు కనిపించగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ‌వృక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోహరాచారి సహకారంతో దీనిని క్లార్కిఇండా ట్రాకోడెస్‌లిగా నిర్ధారించారు. సుమారు 15సెంటీ మీటర్ల ఎత్తు, 15 సెంటీ మీటర్ల వ్యాసం కలిగిన ఫలనాంగంతో (గొడుగు) ఉండే ఈ పుట్టగొడుగు జింక చర్మాన్ని పోలిన గోధుమ రంగు పొలుసులతో ఆకర్షణీయంగా కనిపి స్తుంది. ప్రకృతిలో అత్యంత అరుదుగా కనిపించే ఈ జాతి ఇప్పటి వరకు దేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే నమోదైంది. తాజాగా తెలంగాణలోనూ దీని గుర్తింపు రాష్ట్ర జీవవైవిధ్య పరిశోధనలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పుట్ట గొడుగు విషతుల్యమైనదని, దీనిని ఆహారంగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. తెలియని అడవి పుట్టగొడుగులను సేకరించి తినడం వల్ల తీవ్రమైన విషప్రభావాలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని సూచించారు. అందువల్ల అడవుల్లో కనిపించే పుట్టగొడుగులను ఆహారంగా వినియోగించరాదని సూచించారు.
విద్యార్థులకు పరిశోధనల నిలయం..
తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో ఇప్పటివరకు అనేక అరుదైన వక్షాలు, శిలీంద్రాలు, కీటకాలు, చిమ్మటల జాతులు గుర్తించబడ్డాయి. దీంతో వక్షశాస్త్రం, జీవవైవిధ్యం, పర్యావరణ శాస్త్రం చదివే విద్యార్థులకు ఈ ఉద్యానవనం ప్రత్యక్ష పరిశోధనా కేంద్రంగా, ప్రయోగాత్మక అధ్యయన వేదికగా మారింది.
​ప్రిన్సిపాల్ హర్షం..
ఈ అరుదైన శిలీంద్ర జాతి గుర్తింపు పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సుకన్య హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించడంతో పాటు రాష్ట్ర జీవవైవిధ్య సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి పరిశోధనలకు కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -