రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా : స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్
నవతెలంగాణ – బంజారాహిల్స్
కబ్జాదారుల చెరలో ఉన్న సుమారు రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్ అన్నారు. హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. హైడ్రాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, సంస్థల నేపథ్యాన్ని పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోందని ఆరోపిం చారు. తప్పుడు ఆధారాలతో కోర్టును తప్పుదారి పట్టించి హైడ్రాను బలహీనపరిచే ప్రయత్నా లు జరుగుతున్నాయని, అలాంటి సంస్థలు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నగరంలోని పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి రక్షిం చడంలో హైడ్రా విజయవం తమైందని, అందుకే హైడ్రాను చట్టబద్ధంగా మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కావాలనే కొందరు కబ్జాదారులు లక్ష్యంగా చేసుకున్నారని, దీనికి సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అవసరమైన సమయంలో సంబంధిత ఆధారా లను కోర్టు ముందు ఉంచుతామని
చెప్పారు. నిజాయితీగా పనిచేస్తున్న అధి కారులకు ప్రభుత్వం అండగా నిలిస్తే ప్రజా ప్రయోజనాలు మరింతగా కాపాడవచ్చని అభిప్రా యపడ్డారు. తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని, అలాంటి పత్రాలు జారీ చేసిన అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. హైడ్రా చర్యలతో వాస్తవ పేదలకు న్యాయం జరిగిందని, తప్పుడు పత్రాల కారణంగానే కొందరు ఇబ్బందులు ఎదుర్కొ న్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో సంస్థ నాయకులు మారిశెట్టి మురళీకుమార్, దేవేంద్ర యాదవ్, వరలక్ష్మి, వై. వెంకట నర్సింహారావు, జ్యోత్స్న, బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.
హైడ్రా కమిషనర్ తొలగింపుపై అప్పీలుకు వెళ్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



