Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్ బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహాం

బీహార్ బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహాం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ బీజేపీ ప్రభుత్వంపై దేశ ఉన్నత న్యాయస్థానం తీవ్రం ఆగ్రహాం వ్యక్తం చేసింది. పోలింగ్ ద్వారా ఎన్నిక కాని మంత్రిని మంత్రి వర్గంలో ఎలా కొనసాగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించకుండా సదురు మంత్రిని పదవీలో కొనసాగించడం రాజ్యాంగ ఉల్లంఘనంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. “ఇది పూర్తిగా చట్టపరమైన అంశం. ఎన్నిక కాకుండానే ఒక మంత్రి ఆరు నెలలకు పైగా పదవిలో ఎలా కొనసాగుతున్నారో ప్రభుత్వం వివరించాల్సి ఉంటుంది” అని ప్రధాన న్యాయమూర్తి (CJI) పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ కోసం ఈకేసును కోర్టు ఆగస్టు 4వ వాయిదా వేసింది.

నితిష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు బీహార్ మంత్రివర్గంలో దీపక్ ప్రకాశ్ పంచాయతీ రాజ్ మంత్రి ప్రమాణా స్వీకారం చేశారు.ఏప్రిల్ 15, 2026న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవడంతో ప్రకాష్ పదవీకాలం ముగిసింది. అంతకుముందు ఆయన నాలుగు నెలల 26 రోజుల పాటు పంచాయతీ రాజ్ మంత్రిగా పనిచేశారు. మే 7న సామ్రాట్ చౌదరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఎన్నిక కాకపోయినప్పటికీ ప్రకాష్ మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్నికకాకున్న కూడా సదురు మంత్రి ఆరు నెలల కన్నా ఎక్కువగానే కొనసాగుతున్నారు. దీంతో దీపక్ ప్రకాశ్ చట్టవిరుద్దంగా మంత్రి పదవీలో కొనసాగుతున్నారని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికకానీ మంత్రిని ఆరు నెలలపైగా మంత్రి పదవీలో ఎలా కొనసాగిస్తారని, సమగ్ర వివరణ తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -