- Advertisement -
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సర్పంచ్ విజ్ఞప్తి
నవతెలంగాణ-మద్నూర్
ప్రజల భద్రతే మా ప్రధమ లక్ష్యమని మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామ సర్పంచ్ లోకండే ఆకాష్ అన్నారు. ప్రస్తుతం గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారుల సూచనల మేరకు ఈ విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.
- Advertisement -



