Thursday, July 30, 2026
E-PAPER
Homeజిల్లాలువిధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు

- Advertisement -

జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు. రోజువారీగా వచ్చే బయటి రోగుల (ఓపీ) వివరాలు, ఇన్‌పేషెంట్ల సంఖ్య, ఆస్పత్రిలో జరుగుతున్న కాన్పుల వివరాలను వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించిన ఆయన.. సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలో వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న, డాక్టర్ బిక్కు నాయక్, డాక్టర్ శంకర్, జిల్లా సిబ్బంది డెమో రాజగోపాలచారి, డీపీఓ రేనయ్య, నర్సింగ్ ఆఫీసర్లు ఉఫత్, సుశీల, నిర్మల, ఫార్మసీ ఆఫీసర్ కుమారాచారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -