- Advertisement -
- సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి
నవతెలంగాణ-నవాబు పేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నవాబుపేట మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీమతి గీతా రాణి సుధాకర్ చారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్క సంరక్షించుకోవాలని సూచించారు. మొక్కల సంరక్షణతోనే భూమి మీద జీవరాశి మనుగడకు కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ హజహర్ అలీ పంచాయతీ కార్యదర్శి నరేష్ వార్డు సభ్యులు నాయకులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


