Thursday, July 30, 2026
E-PAPER
Homeఖమ్మంవచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం 

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం 

- Advertisement -

 ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే లక్ష్యం 
పదేళ్లు పాలనలో ఏమి చెయ్యలేని బీఆర్ఎస్  
ఇప్పుడు పేదల కోసం నాటకాలు ఆడుతున్నారు  
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  
నవతెలంగాణ-కల్లూరు

భూ సమస్యలు పరిష్కారం కావాలంటే పూర్తిస్థాయిలో ప్రతి అంగుళం భూమిని రీ సర్వే చేసినప్పుడు పరిష్కారం అవుతాయని, రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో భూ సమస్య లేకుండా చేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కల్లూరు లోని  డి ఎన్ పి ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి కల్లూరు, తల్లాడ మండలల ప్రజల నుండి వినత పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు సమస్యలు పరిష్కరిస్తామని ధరణి పథకం తీసుకొచ్చి భూములు కబ్జాలు చేయడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. కబ్జాలు చేసిన ప్రతి అంగులం భూమిని వదిలిపెట్టే సమస్య లేదని అందరి జాతకాలు బయటకు తీస్తానని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఇప్పటికీ భూమి రీ సర్వే ప్రారంభించామని, తొలివిడదలో ప్రతి మండలంలో కొన్ని గ్రామాలలో రీ సర్వే చేస్తున్నామని తెలిపారు. మూడు విడతల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం భూమీ రీ సర్వే చేసి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని స్పష్ట చేశారు. అప్పటివరకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో భూ సమస్యల తర్వాత ప్రధానంగా ప్రజల నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ దఖాస్తులు వస్తున్నాయని అన్నారు. ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విధంగానే గృహాలు మంజూరు చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎక్కువమంది పేదలు గృహాలు కావాలని అడుగుతున్నారని నా దృష్టి తీసుకొచ్చిరాన్నారు. ఆ విధంగానే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా దర్బార్ లో ఇచ్చిన ప్రతి దరఖాస్తులను అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా, డివిజన్ అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం పేదవాళ్లు ఎక్కువ శాతం ఉన్నారని, గృహాల దరఖాస్తు చేసుకుంటున్నా రు అందరికీ ఇల్లు మంజూరు చేయడం కోసం అవసరాన్ని పెట్టి ఎక్కువ ఇల్లు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు ప్రజలు సమస్యలను ప్రజా దర్బార్ దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్, ఎ ఎం సి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, సబ్ కలెక్టర్ ఆ జయ్ యాదవ్, ఏసిపి సుందర యాదవ్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, సర్పంచ్ కాంగ్రెస్ 
పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -