అంతర్జాతీయ క్రికెట్‌కు
రహానె వీడ్కోలు
ముంబయి : భారత మాజీ కెప్టెన్, సంప్రదాయ శైలి క్రికెటర్ అజింక్య రహానె ఆటకు వీడ్కోలు పలికాడు. 12 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్టు అజింక్య రహానె గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 85 టెస్టులు 90 వన్డేలు, 20 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానె.. జులై 2023 వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆఖరు ఆట ఆడేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకత సాధించిన అజింక్య రహానె టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ప్రధాన బ్యాటర్‌గా నిలిచాడు. స్వదేశంలో సాధారణ గణాంకాలు నమోదు చేసిన అజింక్య రహానె.. విదేశీ గడ్డపై నాణ్యమైన పేస్‌ను ఎదుర్కొని దీటుగా రాణించాడు. 2020-21 ఆస్ర్టేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో సాధించిన భారత జట్టుకు అజింక్య రహానె సారథ్యం వహించటం అతడి కెరీర్‌కే తలమానికం. 85 టెస్టుల్లో 5077 పరుగులు, 90 వన్డేల్లో 2962 పరుగులు, 20 టీ20ల్లో 375 పరుగులు చేసిన రహానె.. టెస్టుల్లో 12 సెంచరీలు, 26 అర్థ సెంచరీలు, వన్డేల్లో 3 సెంచరీలు, 24 అర్థ సెంచరీలు, టీ20ల్లో ఓ అర్థ సెంచరీ సాధించాడు.
అజింక్య అల్విదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



