- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య సందర్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు సరిపడా ఉన్నాయా..లేవాని మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని వైద్యాధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కుల వెంకటస్వామి యాదవ్ పాల్గొన్నారు.
- Advertisement -



