Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది 

విప్లవ పార్టీల పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగింది 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ప్రజల్లో విప్లవ పార్టీల పట్ల చైతన్యం పెరిగిందని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, ఆర్ జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పూనెమ్ లింగన్న 7వ వర్ధంతి, న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కామ్రేడ్ పూనెమ్ లింగన్న సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకునిగా, అజ్ఞాత దళ కమాండర్ గా, నేతగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో ఆ ప్రజలకు అండగా  నిలబడడమే కాకుండా లక్షలాది ఎకరాల పోడు భూములను ప్రజలు స్వాదీనం చేదుకునే విధంగా ఆదర్శవంతమైన పోరాటాలను నిర్మించిన విప్లవ ప్రజా నాయకుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య, పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య,మామిడాల బాల మల్లేష్, పీ వై ఎల్ జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుజోడు సిద్దేశ్వర్, సాదుల శ్రీకాంత్, ప్రజా సంఘాల నాయకులు ఆర్.ఉదయ్, పున్నపురెడ్డి రాఘవ రెడ్డి,మాలోత్ మోతీలాల్, చిర బోయిన కొమురయ్య, కట్టా సమరసింహారెడ్డి, గడ్డం మంకయ్య, యెర్ర మల్లేష్, తమ్మడి అంజయ్య, పంజాల మురళి, యెలగందుల సిద్దులు, చిర బోయిన బాలయ్య, కొమ్మిడి గోపాల్ రెడ్డి, దార యాదగిరి, కుర్రి మార్కండేయ, యెర్రబెల్లి అయిలయ్య, ఊరడి రామ చంద్రు, తలారి వెంకటేష్, కడకంచి సత్తయ్య, శిఖిలం వెంకటేష్, ఉచ్చంతల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -