Friday, July 31, 2026
E-PAPER
Homeజిల్లాలుఆలేరు బంద్ విజయవంతం 

ఆలేరు బంద్ విజయవంతం 

- Advertisement -

స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువజన సంఘాలు, వ్యాపారస్తులు, వివిధ పార్టీల నాయకులు 
నవతెలంగాణ-ఆలేరు టౌన్

ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ శుక్రవారం తలపెట్టిన ఆలేరు పట్టణ బంధు విజయవంతమైంది. ఆలేరు రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ, అఖిలపక్ష కమిటీ ల ఆధ్వర్యంలో ఆలేరు పట్టణ బంద్ సందర్భంగా బస్టాండ్ వద్ద, రాస్తారోకో, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. బిఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సీపీఐ(ఎం), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, బీఎస్పీ, పార్టీలు, అంబేద్కర్ యువజన సంఘం, వ్యాపార సంఘం, మీడియా సంఘం, నాయకులు పాల్గొని ఆలేరు రెవిన్యూ డివిజన్ ఆవశ్యకతను వివరించారు.

ఆలేరు పేరుకే అసెంబ్లీ, విద్య, వైద్య, వ్యాపార రంగంలో పరిశ్రమల రంగంలో పూర్తిగా వెనుకబడిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గత  10 సంవత్సరాల నుండి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బిర్ల ఐలయ్య, మేము అధికారంలోకి వస్తే, వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచారన్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆలేరు రెవిన్యూ  డివిజన్ అంశాన్ని వాడుకొని ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. 

ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుని, చిత్తశుద్ధి తో నెరవేర్చాలన్నారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, ఒకదాని తర్వాత ఒకటి వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయని, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఉండే క్యాంప్ ఆఫీసు నుండి ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య కొనసాగించాలని కోరారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతే, భవిష్యత్తులో జరిగే డిలిమిటేషన్లో అసెంబ్లీ కోల్పోయే ప్రమాదం ఉన్నదని, ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధిస్తే, ఆలేరు అసెంబ్లీని కాపాడుకున్న వాళ్ళమవుతాం అని చెప్పారు.

ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు అయితే లాభాల గురించి మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ఐదు మండలాలు ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు, గుండాల వస్తాయని, ఈ 5 మండలాల పరిధిలో 98 గ్రామాలు ఉంటాయని,  రెవిన్యూ డివిజన్ కార్యాలయానికి అనుబంధంగా 23 కార్యాలయాలు ఏర్పడతాయని, ఈ 100 గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం ఆలేరుకు రాకపోకలు సాగిస్తారని, ఆటోమేటిక్గా ఆలేరు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేంతవరకు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామాని తెలియజేశారు.

 మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పూస శ్రీనివాస్  ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బంద్ లో పాల్గొని  మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ , కన్వీనర్ పసుపునురి వీరేశం ,కో కన్వీనర్ చెక్క వెంకటేష్ ,రాచకొండ జనార్ధన్, వడ్డెమాన్ నరేందర్ ,పుట్ట మల్లేష్ ,మొరిగాడి చంద్ర  శేఖర్, మొరిగాడి రమేష్, తుంగ కుమార్, చిరిగే శ్రీనివాస్,  ఎలుగల కుమారస్వామి, మంచన మల్లేశం, సిద్ధార్థ,

ఇక్కిర్ సహదేవ్, ఇక్కిరి శ్రీనివాస్ ,ఎలుగల వెంకటేష్ , చిలుగురి  నర్సిరెడ్డి ,పూల హనుమంత్ ,గంగుల శ్రీనివాస్, రచ్చ రామ నరసయ్య,   యాదగిరి  ,వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి లక్ష్మణ్ , బందెల  సుభాష్, కె.శంకర్ ,బేతి కృష్ణ హరి, సిహెచ్ ప్రకాష్, బెదరకోట  దుర్గేష్, వంగాల నరసింహారెడ్డి, కే రాజు, రవి, పరిషరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -