టీఆర్వీకే శాస్త్రవేత్త
డాక్టర్ పి మధుకర్ రావు
పత్తి, పంట పొలాలను
సందర్శించిన శాస్త్రవేత్తలు
నవతెలంగాణ-గంగాధర
రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అనుసరిస్తేనే పంటల్లో అధిక దిగుబడి వస్తుందని కరీంనగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.మధుకర్ రావు అన్నారు. గంగాధర మండలంలోని కొండన్నపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో శుక్రవారం ఆయన వరి, పత్తి పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. మధుకర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు పొలాలను తరచూ పరిశీలిస్తూ పోషక లోపాలను సకాలంలో సరిచేయడం, పురుగు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. పంటలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను, అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖ అధికారులను రైతులు సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రావెప్ విద్యార్థులు అర్జున్, రామ్ శశాంక్, ప్రణయ్, జితేందర్, శివశంకర్, దినేష్, రైతులు, రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం విద్యార్థులు పాల్గొన్నారు.
శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



