Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్నం రుక్కమ్మకు
 టీపీసీసీ చీఫ్‌ నివాళి

పట్నం రుక్కమ్మకు
 టీపీసీసీ చీఫ్‌ నివాళి

- Advertisement -

నవతెలంగాణ-షాబాద్
శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్‌ పట్నం మహేందర్‌‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్‌‌రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్, పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరతో కలిసి రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గుడిమల్కాపూర్ ఏఎంసీ వైస్ చైర్మెన్ కావలి చంద్రశేఖర్, డీసీసీ ప్రధానకార్యదర్శి కుమ్మరి చెన్నయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు సలీంపాషా, మండల అధ్యక్షులు దర్పల్లి రవీందర్ గౌడ్, జర్నలిస్టుల సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెంటారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ప్రభాకర్‌ ‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, వివిధ గ్రామాల సర్పంచులు వారిని పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -