విజిలెన్స్ దాడులతో వెలుగులోకి
విచారణ చేపట్టిన పరకాల ఏసీపీ
నవతెలంగాణ -శాయంపేట
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్ల కానిపర్తి గ్రామంలో ఉన్న శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రిస్, లక్ష్మీనరసింహ ఆగ్రో ఇండస్ట్రిస్ రైస్ మిల్లుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో పరకాల ఏసీపీ సతీష్ బాబు రైస్ మిల్లులను సందర్శించారు. సుమారు రూ.9 కోట్ల ధాన్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. గురువారం విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మిల్లుల్లోని పూర్తి వివరాలు సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఏసీపీ సతీష్ బాబు ఆ మిల్లులను సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. రైస్ మిల్లర్లు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న ధాన్యం అక్రమ దందా విషయంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రైస్ మిల్లుల్లో భారీ కుంభకోణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



