Sunday, August 2, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్బెలూన్‌, గ్లాస్‌ ప్రయోగం

బెలూన్‌, గ్లాస్‌ ప్రయోగం

- Advertisement -

కావలసిన వస్తువులు: బెలూన్‌, గ్లాస్‌, అగ్గిపెట్టె, పేపర్‌
ప్రయోగం చేయు విధానం: ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.. ముందుగా బెలూన్‌లోకి ట్యాప్‌ సహాయంతో కొంచెం నీరు తీసుకొని, బెలూన్‌ను ఊది ముడి వేసుకోవాలి. ఆ తర్వాత ఓ కాగితం ముక్కను వెలిగించి గ్లాసులో వేయాలి. గ్లాసులో వేసిన పేపర్‌ ముక్క ఆరిపోకముందే, నీళ్లు నింపిన బెలూన్‌ను గ్లాసు మీద పెట్టి గమనించండి.
ప్రయోగ వివరణ: మనం మండుతున్న కాగితం ముక్కను గ్లాసులో వేసినప్పుడు, గ్లాసులో ఉన్న గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. నీటితో నింపిన బెలూన్‌ను గ్లాసు మీద పెట్టినప్పుడు, మంట ఆరిపోయి వ్యాకోచించిన గాలి సంకోచించి గ్లాసు లోపల కొంచెం వాక్యూమ్‌ సష్టించబడుతుంది. గ్లాసు లోపల పీడనం బయట ఉన్న గాలి పీడనం కన్నా తక్కువగా ఉంటుంది. బయట ఉన్న గాలి లోపలికి పోవడానికి ప్రయత్నిస్తూ బెలూన్‌ను గట్టిగా లోపలికి నెట్టుతుంది. కావున బెలూన్‌, గ్లాసు లోపలి గోడలను గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనమం బెలూన్‌ సహాయంతో గ్లాసును సులభంగా కింద పడకుండా పైకి లేపవచ్చును.

వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -