Sunday, June 21, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్బాటిల్‌, బెలూన్‌ ఫౌంటెన్‌ ప్రయోగం

బాటిల్‌, బెలూన్‌ ఫౌంటెన్‌ ప్రయోగం

- Advertisement -

లిటిల్‌ సైంటిస్ట్‌
కావలసిన వస్తువులు: బాటిల్‌, బెలూన్‌, స్ట్రా.
ప్రయోగం చేయు విధానం: ప్రియమైన విద్యార్థినీ, విద్యార్థులారా..! ఏదైనా గట్టిగా ఉన్న కూల్‌డ్రింక్‌ బాటిల్‌ తీసుకొని దాని అడుగు భాగంలో చిన్న రంధ్రం చేయండి. అలాగే బాటిల్‌ లిటిల్‌ సైంటిస్ట్‌తకు రంధ్రం చేసి దానికి స్ట్రా బిగించండి. ఆ తర్వాత బాటిల్‌ లోపలికి బెలూన్‌ అమర్చండి. నోటి ద్వారా బెలూన్‌ లోపలికి గాలి ఊది, బాటిల్‌ అడుగు భాగమున ఉన్న రంధ్రాన్ని లిటిల్‌ సైంటిస్ట్‌సి, మీ నోటిని బాటిల్‌ లిటిల్‌ సైంటిస్ట్‌తి నుండి తీసివేయండి. ఆ తరువాత బెలూన్‌ లోపలికి నీటిని నింపండి. నీటిని నింపిన తర్వాత స్ట్రా అమర్చిన బాటిల్‌ లిటిల్‌ సైంటిస్ట్‌తను బాటిల్‌కు పెట్టండి. లిటిల్‌ సైంటిస్ట్‌త పెట్టిన తర్వాత అడుగున ఉన్న రంధ్రం నుండి మీ వేలును తీసి గమనించండి.
ప్రయోగ వివరణ: విద్యార్థినీ, విద్యార్థులారా! రంధ్రం లేనటువంటి బాటిల్‌కు బెలూన్‌ అమర్చి, బెలూన్‌ను ఊదినచో బెలూన్‌ ఉబ్బదు. కారణం బాటిల్‌ లోపల గాలి ఉంటుంది. రంధ్రం ఉన్న బాటిల్‌ను ఊదినపుడు, రంధ్రం ద్వారా బాటిల్‌లో ఉన్న గాలి బయటకు పోయి బెలూన్‌ ఉబ్బుతుంది. ఆ తర్వాత బెలూన్‌ లోపలికి నీటిని నింపి, బాటిల్‌ లిటిల్‌ సైంటిస్ట్‌తను పెట్టి, రంధ్రం వద్ద ఉన్న వేలును తీస్తే ఫౌంటెన్‌లాగా నీరు బయటకు వస్తుంది. రంధ్రం వద్ద ఉన్న వేలును తీసినప్పుడు, బయట ఉన్న గాలి రంధ్రం ద్వారా బాటిల్‌ లోపలికి పోయి, బెలూన్‌ మీద ఒత్తిడి కలిగించి, బెలూన్‌ లోపల ఉన్న నీటిని బయటకు నెట్టుతుంది.
వాలుగొండ వెంకటేశ్వర్లు,
సైన్స్‌ పాపులరైజర్‌, 9640053470

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -