- Advertisement -
కావలసిన వస్తువులు- బెలూన్, చిన్న చిన్న కాగితపు ముక్కలు.
ప్రయోగం చేయు విధానం- విద్యార్థులారా కాగితాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని బెలూన్ ను బాగా ఊది పొడిగా ఉన్న జుట్టుకు బాగా రుద్దుకొని త్వరగా కాగితపు ముక్కల దగ్గరికి తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి.
ప్రయోగ వివరణ- పొడి జుట్టుకు రద్దుకున్న బెలూన్ ను కాగితపు ముక్కల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది మనం బెలూన్ ను పొడి జుట్టుకు రుద్దినప్పుడు ఎలక్ట్రాన్ల మార్పిడి వలన బెలూన్ చార్జ్ అవుతుంది చార్జ్ అయిన బెలూన్ కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది.
- Advertisement -



