Saturday, August 8, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్మనమంతా ఒక్కటే

మనమంతా ఒక్కటే

- Advertisement -

యమునా నదీ తీరంలో వున్నా ఓ చిన్న వనం అది. అక్కడ పెద్ద పెద్ద చెట్లుతో పాటు దానిమ్మ, బత్తాయి, నారింజ, జామ లాంటి మొక్కలు వున్నాయి. అప్పుడే సాయం సంధ్యా సమయం అవుతోంది. పక్షులు ఒక్కొక్కటిగా గూటికి చేరుకుంటున్నాయి. మందారం అనే పిచ్చుక చెదిరిన తన గూడు సరి చేసుకుంటోంది.
పక్కనే కొమ్మ మీద వున్న కాకి ”ఓ మందారం ఎప్పుడు ఏదో పనేనా ఒక్కసారైనా మాతో మాట్లాడేది ఉందా!” అంది.
”ఎందుకు మాట్లాడను చీకటి పడుతోంది అని గూడు బాగు చేసుకుంటున్నా!” అంది.
”ఆ పొట్టి ముక్కుతో ఏం పనిచేస్తావులే” అంది కాకి వెటకారంగా.
ఆ పక్క నున్న ముసలి గద్ద ”కాకమ్మా ఎవరి అవసరాన్ని బట్టి ఈ సృష్టిలో శరీరాలు ఏర్పడ్డాయి. మందారం చిన్నది కనుక దాని ముక్కు కూడా చిన్నదే. అదే ఆ కొంగని చూడు చేపలు పట్టేందుకు వీలుగా పొడవైన మెడ అలాగే పొడవైన ముక్కు. ఇక ఈ చిలుకమ్మ కాయలు పండ్లు కోరికేందుకు వీలుగా దాని ముక్కు వంకరగా కొనదేరి వుంటుంది” అంది.
”ఏమిటీ ముక్కుల గోల” అంటూ కాకి వంక చూసిన వడ్రంగి పిట్ట.. అదా సంగతి, కాకమ్మ ముక్కుకి ముక్కెర పెట్టింది. అందుకే ముక్కు గురించి మాట్లాడడం మొదలు పెట్టింది” అంది.
అన్ని పక్షులు కాకి వంక చూసాయి. కాకి మరింత వయ్యారం పోతూ ముక్కు అటు ఇటు తిప్పింది. ఆ హడావిడిలో దాని ముక్కెర కిందనున్న పుల్లల మద్యన పడి పోయింది. అయ్యో అని కాకి బాధ పడడం చూసి, మందారం ఆ పుల్లల మద్యన దూరి ఆ ముక్కెర తెచ్చి ఇచ్చింది. నిన్ను అనవసరంగా మాటలన్నాను, నన్ను క్షమించు మందారం. నేనైతే ఆ పుల్లల మద్యన దూరలేను” అంది కాకి.
”ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడంలో మనమంతా ఒకటే” అంది ముసలి గద్ద. అన్నీ సంతోషించాయి.

– కూచిమంచి నాగేంద్ర, 9182127880

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -