- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు నిజమైన శక్తి అని ఆయన పేర్కొన్నారు. రాబోయే 100 వారాల పాటు ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా కేంద్రాల్లో కోటి మందికి పైగా యువత డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
- Advertisement -



