Sunday, August 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, దోమలగూడ, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, మాన్‌సూన్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -