- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆగస్టు 16 లోగా ఈ-కేవైసీని పూర్తి చేయించుకోవాలి. దీనిని పూర్తి చేయకపోతే, గృహ వినియోగ సిలిండర్లపై సబ్సిడీ నిలిపివేయబడుతుంది. సిలిండర్ డెలివరీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ-కేవైసీని ఆన్లైన్ యాప్ల ద్వారా, గ్యాస్ ఏజెన్సీని సందర్శించడం ద్వారా లేదా డెలివరీ వ్యక్తి సహాయంతో పూర్తి చేసుకోవచ్చు. ఈ నిబంధనలను పాటించని వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.
- Advertisement -



