- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే బెంగళూరులో తొలి దశ సేవలకు ఏర్పాట్లు పూర్తిచేసిన సంస్థ, ఆగస్టు 15లోగా సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం రెస్టారెంట్ల ఆన్‌బోర్డింగ్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్, కేవలం 10 శాతం కమిషన్‌తో భాగస్వాములను ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్రోసరీ, మాంసం డెలివరీ సేవలు అందిస్తున్న సంస్థ, ఇప్పుడు ఫుడ్ డెలివరీలోకి కూడా ప్రవేశించడం ద్వారా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే యాప్‌లో పలు సేవలు అందించడమే కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది.
- Advertisement -



