నవతెలంగాణ-హైదరాబాద్: భారత క్రీడారంగంలో తీవ్ర కలకలం రేపిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ అధ్యక్షుడు, బిజెపి నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ …. సోమవారం ఢిల్లీ రెవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ తో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపడంలో పూర్తిగా విఫలమైందని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తన తీర్పులో తెలిపారు. WFI చీఫ్‌గా ఉన్న సమయంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ 2023లో దేశంలోనే ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు పూర్తి చేసి 2023 జూన్ 15న దాదాపు 1,500 పేజీల సుదీర్ఘ ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పుపై బాధితుల తరపు న్యాయవాదులు పై కోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ త్వరలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి బాధితుల లీగల్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం మరోసారి ఉన్నత న్యాయస్థానంలో చర్చనీయాంశంగా మారనుంది.
బ్రిజ్ భూషణ్ నిర్దోషి: ఢిల్లీ కోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



