నవతెలంగాణ-ఆలేరు టౌన్
అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (టీజీడీడీసీఫ్ ) చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలను, ఆలేరు పట్టణానికి చెందిన యువ నాయకుడు దూడల ఉదయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా చేశారు. అదేవిధంగా వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా దూడల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. గుత్తా సుఖేందర్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్‌గా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని, రాజకీయ పరిస్థితులను, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలని గుర్తు చేసుకున్నారు.
ఆలేరు ప్రాంత ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై జరిగిన చర్చ ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగిందన్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని, ముఖ్యంగా తన తండ్రి యోగక్షేమాలు ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాసేవలో గ్రామీణాభివృద్ధి, యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం వంటి అంశాలపై ఉదయ్ కుమార్ తన మనోభావాలను వెల్లడించారు. ప్రజలసంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.



