నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌లను లైంగిక వేధింపుల కేసులో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. మహిళల భద్రత, సాధికారత గురించి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్పుకొంటుంటే, మరోవైపు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.’ఒకవైపు యువతకు అండగా ఉన్నామని, మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారు. మరోవైపు ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
కాగా,ఈ కేసు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రారంభమైంది. 2023లో ఢిల్లీ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపులు, మహిళలపై దాడి, బెదిరింపులు తదితర అభియోగాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వినోద్ తోమర్ కూడా సహ నిందితుడిగా ఉన్నారు.



