Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారి

ఖరీఫ్ పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని నాగల్ గావ్ క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్, ప్రత్తి,పెసర, పుచ్చకాయ, మిరప తదితర పంటలను నాగుల్గావ్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సోయాబీన్ పంటలో ఐరన్ లోపం, పచ్చ పురుగు గమనించి దాని నివారణకు ఫార్ములా 6 @ 200గ్రాములు ఎకరాకు దానితో పాటు 19.19.19@1kg ఎకరాకు ,వేపనూనె (1500ppm) 500 ml ఎకరాకు+ అసిఫేట్ 300గ్రాములు ఎకరాకు+ ప్రొఫెనోఫోస్ 40 EC 400 ml ఎకరాకు మొదటి స్ప్రే గా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు వివరించారు.

ప్రత్తి పంటలో ప్రధానంగా రసం పీల్చే పురుగులు అయిన తెల్ల దోమ, పచ్చ దోమ, పెనుబంక గమనించి దాని నివారణకు వేప నూనె (1500ppm) 500ml ఎకరాకు + అసేటమిప్రిడ్ 50 గ్రాములు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 200ml ఎకరాకు లేదా అసిఫేట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ (లాన్సర్ గోల్డ్) 250గ్రాములు ఎకరాకు  200లీటరు ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని రైతు సోదరులకు వివరంగా చెప్పారు. అదేవిధంగా ప్రత్తి పంటలో అధిక తేమ వలన పార విల్ట్ గమనించి దాని నివారకు కాపర్ ఆక్స్ క్లోరైడ్ ( COC) 500గ్రాములు ఎకరాకు + 19.19.19 ఒక కేజీ ఎకరాకు కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.

పుచ్చకాయ పంటలో ఆకు ముడత, కుకుంబర్ మొజాయిక్ తెగుళ్లు గమనించి దాని నివారణకు వేపనూనె (1500ppm) 500 ml ఎకరాకు + తియోమితక్షమ్ 50గ్రాములు ఎకరాకు లేదా ఫ్లునికామిడ్ (ఉలల) 60గ్రాములు ఎకరాకు కలిపి పిచికారి చేయాలని పేర్కొన్నారు.

మిరప పంటలో రసం పీల్చే పురుగులు అయిన తామర పురుగు  (ఆకు పై ముడత),నల్లి ( ఆకు కింది ముడత) గమనించి దాని నివారణకు వేప నూనె (1500ppm) 500 ml ఎకరాకు + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు + Fenpyroximate 200ml ఎకరాకు లేదా వెట్టబుల్ సల్ఫర్ 600గ్రాములు లేదా Propargite 57% EC 400ml ఎకరాకు కలిపి పిచికారి చేయాలని చెప్పారు. క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు శివరాం ప్రకాష్, హరి విట్టోబ పటేల్, సూర్యవంశీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -