శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’.
ఈ సినిమాని ఈనెల 14న భారీ ఎత్తున విడుదల చేబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు డా. కెవిఎల్ఎన్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అజయ్, కాశీ విశాలాక్షి ఈ ప్రయాణంలో నాకెంతో సపోర్ట్ చేశారు. ‘ఆరిజిన్ ఆఫ్ అగధ’ కూడా చాలా వైరల్ అయింది. ఈ సినిమాని అంత సులభంగా తెరకెక్కించలేరు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటివి ఎక్కువగా ఉన్న ఈ మూవీని ఏడాదిలోనే పూర్తి చేశాం. రాకేష్ ఈ మూవీకి అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. పూర్తిగా భక్తిరస చిత్రాన్ని తీసినా కష్టమే అవుతుంది. యూత్, జెన్ జీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అన్ని రకాల అంశాల్ని ఇందు లో పొందుపర్చాం. ఎక్కువ స్క్రీన్‌లలో మూవీని రిలీజ్ చేయబోతున్నాం. మాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ రెడీ చేసి పెట్టాం. ‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్, ‘అగధ’ మూవీకి ఇందులో నటించిన వారంతా కరెక్ట్. శ్రవణ్, కామాక్షి, జోవికా, ఉల్కా అందరూ అద్భుతంగా నటించారు. ‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఓ సరికొత్త సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నామని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు.
అద్భుతమైన కథతో ‘అగధ’
- Advertisement -
- Advertisement -



