నవతెలంగాణ – మునిపల్లి
మండంల పరిధిలోని అంతారం గ్రామ పంచాయితీలో మంగళవారం సర్పంచ్ బంగారిగళ్ళ పవిత్ర ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్ మల్లారెడ్డి వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డయాబెటిక్, బిపి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు ఉచిత చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. హాస్పిటల్ వాళ్ళు గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ అన్నారు. ఈ శిబిరంలో గ్రామ కార్యదర్శి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ నాయకులు బంగారిగళ్ళ మానయ్య, విట్టల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అంతారంలో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



