Monday, September 14, 2026
E-PAPER
Homeజిల్లాలునవాబుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

నవాబుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్‌లు, కేసు రికార్డులు, స్టేషన్ నిర్వహ, సీసీటీఎన్‌ఎస్ నమోదు వివరాలు, పెండింగ్ కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ పెండింగ్ కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, రాత్రి గస్తీని మరింత పటిష్ఠంగా నిర్వహించడం, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమం నందు సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -