•సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్
నవతెలంగాణ-మర్రిగూడ
వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని మండలంలోని యరగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు.వర్షాలు కురవాలని మంగళవారం గ్రామంలో బొడ్రాయి తో పాటు,గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతు ఆనందంగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని,గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం,దేశం పురోగమిస్తాయని అన్నారు.
ప్రకృతి అనుకూలించి మంచి వర్షాలు కురవడం వ్యవసాయానికి ఎంతో అవసరమని,రైతులు ఆశించిన విధంగా పంటలు పండితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.రైతు కష్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని,వ్యవసాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.గ్రామ ప్రజలంతా రైతులకు అండగా నిలవాలని, ప్రకృతి విపత్తులు దూరమై ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణమ్మ,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,రైతులు, మహిళలు,యువకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



