Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థినులకు పైలట్ శిక్షణ

విద్యార్థినులకు పైలట్ శిక్షణ

- Advertisement -


భారత్ కేర్స్ తో ఇంటర్మీడియట్ బోర్డు ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినీలకు పైలట్ శిక్షణ అవకాశాలను కల్పించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, భారత్ కేర్స్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా “గివింగ్ వింగ్స్ టు ఫ్లై” కార్యక్రమం ద్వారా పైలట్ శిక్షణ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ తో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం వంటి సహాయాలు లభిస్తాయి. మంగళవారం హైదరాబాద్ లోని బోర్డ్ ఆప్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఇంటర్‌ ‌విద్య డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. “ఈ ఒప్పందం విద్యార్థులకు విమానయాన రంగంలో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇండిగోరీచ్, భారత్‌కేర్స్ తో కలిసి పనిచేయడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు పైలట్‌గా మారే కలను నిజం చేసుకోవచ్చు..’ అని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్… కళాశాలలు, విద్యార్థి నెట్‌వర్కుల ద్వారా ఈ కార్య క్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయనుంది. భారత్‌కేర్స్ సంస్థ… అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు, కౌన్సెలింగ్ సహాయాన్ని అంది స్తుంది. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యెంక్యా నాయక్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్న రాణి, భారత్‌కేర్స్ ప్రతినిధి సి.సాయి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -