Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలి

‌పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలి

- Advertisement -

ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హోంశాఖ పరిధిలో 19 వేల పోలీసు పోస్టులు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏడు వేల పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఫైర్ శాఖ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన పెట్టడం సరైంది కాదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కొత్త పోలీసు కమిషనరేట్లు వచ్చాయని గుర్తు చేశారు. వాటిలో నోటిఫికేషన్లు ఇవ్వాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆలస్యం అవుతుందని ప్రభుత్వం అంటోందని చెప్పారు. పాత జిల్లాల ప్రకారం కొత్త కమిషనరేట్ల పరిధిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. లాంగ్ జంప్ కొత్త నిబంధనలను ప్రభుత్వం ఎత్తేయాలని డిమాండ్‌ ‌చేశారు. లాంగ్ జంప్ నాలుగు మీటర్లు కాకుండా మూడు మీటర్ల నాలుగు అంగుళాలకు పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్నారు. ఎస్సై పోస్టుకు రూ.1,500, కానిస్టేబుల్‌కు ‌రూ.వెయ్యి దరఖాస్తు ఫీజు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజులను వసూలు చేయబోమని హామీ ఇచ్చారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -