ముఖ్యఅతిధిగా కేసీఆర్
హాజరయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మండలి ప్రతిపక్ష నేత సి మధుసూదనాచారి, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు. ఈనెల పదో తేదీన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభను ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. సంతాప సభకు వేలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పెద్ది సుదర్శన్‌రెడ్డి బంధువులు, అభిమానులు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత హన్మకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాలని నాయకులు భావిస్తున్నారు.
10న నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



