ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
అధిక పని ఒత్తిడిని తగ్గించాలి :ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ఆర్టీసీలో రెగ్యులేషన్‌లో మార్పులు చేస్తే కార్మికులకు ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గురువారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల సమస్యలపై ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరంతరం పని చేస్తోందని, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తోందని తెలిపారు. రెగ్యులేషన్ మార్పుతోనే ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ పోరాట ఫలితంగానే కండక్టర్లకు ఉద్యోగ భద్రత కమిటీ ఏర్పడిందని చెప్పారు. వర్క్ లోడ్ తగ్గించాలని, బెడ్ విన్ స్కీం కార్మికులను రెగ్యులర్ చేసి వారి సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్వాల డిపో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్.వెంకటయ్య, జిల్లా కార్యదర్శి సి.నాగేశ్వర్, గౌరవ అధ్యక్షులు వివి.నరసింహ, ఉపాధ్యక్షులు బి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.విజయులు, ఉపాధ్యక్షులు జె.శేఖర్, ప్రచార కార్యదర్శి వి.రాము, కోశాధికారి ఆర్.నరసింహయ్య, ఏ.కృష్ణయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ వనపర్తి జిల్లా డిపో నాయకులు, సీఐటీయూ అధ్యక్షులు ఎస్.కృష్ణయ్య పాల్గొన్నారు.
రెగ్యులేషన్ మార్పుతోనే ఉద్యోగ భద్రత సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



