నవతెలంగాణ – హైదరాబాద్ : నవతెలంగాణ – హైదరాబాద్: గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి సూచించాయి. నిర్దేశిత గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్ సేవలు, సబ్సిడీపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కంపెనీలు స్పష్టం చేశాయి. ఇంకా పూర్తి చేయని వారు సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా, డెలివరీ బాయ్ సహాయంతో లేదా ఆన్‌లైన్ విధానంలో సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపాయి. వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సూచించాయి.
గ్యాస్ వినియోగదారులు అలర్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



