- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మల్పర్తి హర్షవర్ధన్ (19) అనే యువకుడు మృతి చెందాడు. ఫ్లెక్సీకి ఉపయోగిస్తున్న ఇనుప పైపు విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



