Friday, August 7, 2026
E-PAPER
Homeఆటలుప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కి గాయం

ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కి గాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైంది. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అతడి కుడి చేతి ఉంగరపు వేలికి బలమైన దెబ్బ తగిలింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతడు మైదానంలోకి దిగడం లేదని బీసీసీఐ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన పురోగతిపై నిఘా ఉంచినట్లు వెల్లడించింది. గిల్ గైర్హాజరీలో తొలి రోజు భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -