Friday, August 7, 2026
E-PAPER
Homeజిల్లాలునల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన 

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
పీఆర్సీ, డీఏలను వెంటనే విడుదల చేయాలని యు.ఎస్.పి.సి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు, మండలాధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యాధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధుల కేటాయింపు హామీని పూర్తిగా విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో వేలాది ప్రభుత్వ బడుల కుదింపునకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యూకేజికే పరిమితం చేశారని, ప్రీప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12.00 గంటల వరకే నడపాలన్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4.00 వరకు ప్రీప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12.00 తర్వాత పసి పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులను ప్రతినెల రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం నాయకులు లక్ష్మయ్య, జానకమ్మ, విజయం భాస్కర్, నిమ్మయ్య, బాల్ రాజ్ తో పాటు మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -