Friday, August 7, 2026
E-PAPER
Homeఖమ్మంఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం

ఆగస్టు 10న తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిద్దాం

- Advertisement -

– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ – సత్తుపల్లి

ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో ​రైతు సంఘ మండల నాయకుడు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ, ​రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’ నిర్వహిస్తున్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలు,  కార్మికులు, రైతుల హక్కులపై దాడి చేస్తోందని విమర్శించారు. ​పరిశ్రమల అధిపతుల కోసం నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి, పనిగంటలను 8 నుండి 12 గంటలకు పెంచారని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం అన్ని పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ​నూతన విత్తన చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ​ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ​ఉపాధి హామీ కూలీలకు ఏటా 200 రోజుల పని కల్పించి, రోజువారీ కనీస వేతనం రూ. 800 చెల్లించాలన్నారు. 

కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. ​ఆగస్టు 10న సత్తుపల్లి మండల తహసిల్దార్ కార్యాలయ ముట్టడిలో కార్మికులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు జాజిరి జ్యోతి, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, వ్యకాస  మండల కార్యదర్శి కావ్వారపు లక్ష్మణరావు, నాయకులు బండి వేలాద్రి, ఎలగం రాములు, కొప్పుల చిన్నస్వామి, దాట్ల రాంబాబు, తడికమళ్ల  రామకృష్ణ, ​కొత్తపల్లి రఘు, తోటకూర వెంకట్రావు, రామకృష్ణ  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -