గ్లోవ్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Huge fire accident in gloves factory– ఆరుగురు మృతి
– మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘటన
ముంబయి : మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ప్రమాదం చోటు చేసుకున్నది. గ్లోవ్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరగటంతో ఆరుగురు మృతి చెందారు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీ మూసివేసి ఉన్నదనీ, ఆ సమయంలో తాము ఫ్యాక్టరీ వద్ద నిద్రిస్తున్నామని కార్మికులు తెలిపారు. ”మాకు ఉదయం 2.15 గంటలకు కాల్‌ వచ్చింది. ఘటనా ప్రదేశానికి చేరుకునే సమయానికి మొత్తం ఫ్యాక్టరీ మంటల్లో ఉన్నది. అధికారులు ప్రవేశించి ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు ” అని అగ్నిమాప శాఖాధికారి మోహన్‌ ముంగ్సే తెలిపారు. తెల్లవారే సమయానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు.

Spread the love