ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, ‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. మేమందరం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. యశ్ ప్రతి సినిమాతో ఎదుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. తనకు మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఇది నా సినిమా కాదు.. ఇది ఇండియన్ సినిమా. ఎంతోమంది ప్రతిభావంతులు కలిసి ఈ సినిమాను రూపొందించారు.
ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. గీతు మోహన్‌దాస్ చాలా అద్భుతమైన, ప్యాషనేట్ డైరెక్టర్. నిర్మాత వెంకట్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. మాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఈ సినిమా కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది’ అని యశ్ చెప్పారు. నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ, ‘ఇది మాకు చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. చాలా బోల్డ్ విజన్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజన్‌తోనే ఇంత అద్భుతంగా రూపొందించగలిగాం. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా అద్భుతంగా నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. యశ్ లేకపోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు. దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
బోల్డ్ విజన్‌తో ‘టాక్సిక్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



