చిత్ర దర్శకురాలు మీన లాంగ్‌జామ్ రూపొందించిన ‘ఆండ్రో డ్రీమ్స్’ డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించారు. మహిళా ఫొటోగ్రాఫర్లు, విజువల్ స్టోరీటెల్లర్స్ కోసం ఏర్పాటైన హర్‌ఫోకస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో, షెపర్డ్స్ స్టోరీస్ సాంస్కృతిక వేదిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. హర్‌ఫోకస్‌ను స్పందన కోటేశ్వరమ్మ, కీర్తి సంగు, హృదయ పణుగటి, ప్రేరికా ఎం కలిసి స్థాపించారు.మణిపూర్‌లోని ఆండ్రో గ్రామానికి చెందిన 66 ఏళ్ల లైబీ అనే మహిళ, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఫుట్‌బాల్‌కు అందించిన ప్రోత్సాహం, ఆమె ప్రయాణం చుట్టూ ఈ డాక్యుమెంటరీ కథ సాగుతుంది. సినిమా ద్వారా మహిళల సంకల్పం, క్రీడల పట్ల వారి ఆసక్తి, సామాజిక మార్పు వంటి అంశాలను దర్శకురాలు ఆవిష్కరించారు. ప్రదర్శన అనంతరం మీన లాంగ్‌జామ్ ప్రేక్షకులతో ముచ్చటిస్తూ డాక్యుమెంటరీ రూపకల్పన, ఆండ్రో గ్రామం నేపథ్యం, చిత్రంలోని పాత్రల అనుభవాలు, సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మహిళల కథలను, ప్రాంతీయ సంస్కృతులను, విభిన్న జీవిత అనుభవాలను డాక్యుమెంట్ చేసి వాటిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో హర్‌ఫోకస్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
‘ఆండ్రో డ్రీమ్స్’ ప్రత్యేక ప్రదర్శన
- Advertisement -
- Advertisement -



