Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటు

మద్నూర్ మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు ఆదేశాల మేరకు, నియోజకవర్గ అధ్యక్షులు బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతలా దుర్గ నరేష్, జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూజారి గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు బొమ్మల నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ, గౌరవం, అధికారాల సాధనే ఫోరం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి, ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సమష్టిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అనంతరం మండల గౌరవ అధ్యక్షులు క్యాతం వార్ మహేష్ మాట్లాడుతూ, ఉప సర్పంచుల చెక్ పవర్ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచులతో పాటు ఉప సర్పంచుల పేర్లను తప్పనిసరిగా పొందుపరచాలని కోరారు. ఉప సర్పంచులకు రూ.5,000, వార్డు మెంబర్లకు రూ.3,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదాతో పాటు సర్పంచ్‌తో సమానంగా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ, మండల స్థాయి అధికారిక కార్యక్రమానికి ఉప సర్పంచులను కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించాలని కోరారు. మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా క్యాతం వార్ మహేష్ (రుసేగావ్), ఉపాధ్యక్షుడిగా ఎం.డి. ఫక్రు (షేఖపూర్) ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉప సర్పంచులు, ఫోరం ఉప సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -