Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ చక్ర నారికేల జలాభిషేకం పోస్టర్ల ఆవిష్కరణ

శ్రీ చక్ర నారికేల జలాభిషేకం పోస్టర్ల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో ఈ నెల 15న నిర్వహించనున్న శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మ జన్మదినోత్సవ కార్యక్రమాల పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు మాట్లాడుతూ పద్మావతి అమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవతి శ్రీ చక్ర నారికేల జలాభిషేకం, ఐశ్వర్య లడ్డు పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అన్నప్రసాద వితరణకు సహకరించదలచిన భక్తులు 9849601438 నంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం నారాయణ, ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ నీల బాలు, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -