Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కస్న నాయక్కు మాజీ మంత్రి పరామర్శ

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కస్న నాయక్కు మాజీ మంత్రి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి మండలం కిరియా తండాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్న నాయక్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు కే. మాణిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ధర్మానాయక్, నాయకులు మాధవరెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, చిట్యాల రాము,సర్పంచులు కిష్ట నాయక్, శంకర్ నాయక్ సక్రూ నాయక్ , పిరూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -