Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహాయం కోసం ఎదురుచూపు...

సహాయం కోసం ఎదురుచూపు…

- Advertisement -

నవతెలంగాణ – (నందిపేట్) ఆర్మూర్ : మండల కేంద్రానికి చెందిన విశ్వబ్రాహ్మణ యువకుడు ఎల్లెటి శివశంకర్   బైక్‌పై వెళ్తుండగా ఆంధ్ర బ్యాంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈయన వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడని. ఆయనకు రెండు సంవత్సరాల చిన్న కుమారుడు ఉన్నారని తెలిపారు.. రోజువారీ పనిపై ఆధారపడి జీవించే కుటుంబం కావడంతో, ఈ ప్రమాదం కారణంగా కుటుంబానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని , మానవతా దృక్పథంతో  తోచినంత ఆర్థిక సహాయం అందించి శివశంకర్ చికిత్సకు అండగా నిలవాలని కోరినారు. ఆర్థిక సహాయం కోసం బంగారు నిఖిల  ఫోన్ పే నంబర్ 7730004754 అని తెలిపారు. చిన్న సహాయం కూడా ఈ కుటుంబానికి ఎంతో పెద్ద అండ అవుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -