- Advertisement -
నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని పార్డి( బి )గ్రామమలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఈనెల 5వ తేదీన ప్రారంభమైన తాళ సప్తమి వేడుకళ్ళు మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని రాజరాజేశ్వరునికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను శలవా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆలయనికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు విఠల్,నగేష్, మాజీ జడ్పీటీసీ వి మోహన్ సర్పంచ్ మడి ప్రవీణ్ ఆలయ కమిటీ సభ్యులు పోశెట్టి, సంతోష్, కానోబా, సంతోష్ సెట్ గంగాధర్ గౌడ్ వివిధ గ్రామాల ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



