Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటవీ శాఖ ఆధ్వర్యంలో వనదర్శిని ప్రోగ్రాం.!

అటవీ శాఖ ఆధ్వర్యంలో వనదర్శిని ప్రోగ్రాం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామ పరిదిలోగల అటవీప్రాంతంలో చిన్నతరహా బొగ్గుల వాగు ప్రాజెక్టు వద్ద ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల ప్రిన్స్ పాల్ సిహెచ్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వనదర్శిని ప్రోగ్రాము నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులను ఉద్దేశించి వాటి లాభాలను ప్రయోజనాలను వివరించారు. సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చెట్ల వల్ల పక్షుల వల్ల అనేక లాభాలు ఉన్నాయన్నారు. బీట్ ఆఫీసర్ నరేష్ మాట్లాడుతూ జంతువుల వాళ్ళ లాభాలను విద్యార్థులకు వివరించారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అటవీ జంతువులు, పక్షులు, చెట్లతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. చెట్ల యొక్క ఆకుల నుండి మొదలుకొని వేర్లు సైతం ఎన్నో ఔషధాలకు ఉపయోగపడతాయన్నారు. జంతువులు కూడా అడవికి ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, మోడల్ స్కూల్ వైస్ ప్రిన్స్ పాల్ బాధే భూమయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, లావుడియా సారయ్య, ధనసరి లలిత, ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు, ఫారెస్ట్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -