నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్, మండలాల పరిధిలోగల ఖాళీగా ఉన్న 25 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అలాగే 10 ఆయా పోస్టులకు భారీ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. 25 అంగన్వాడీ టీచర్ పోస్టులకు 500 దరఖాస్తులు వచ్చాయి. 10 అంగన్వాడి ఆయా పోస్టులకు 45 దరఖాస్తులు వచ్చినట్లు మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి రాథోడ్, బుధవారం నవతెలంగాణకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. మూడు చోట్ల అంగన్వాడీ టీచర్ పోస్టుకు గాను 50 కి పైగా దరఖాస్తులు వచ్చాయి. బిచ్కుంద ఆరవ సెంటర్లో టీచర్ పోస్టు భర్తీ కోసం 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా బిచ్కుంద తొమ్మిదవ సెంటర్లో 59 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బిచ్కుంద ఏడవ సెంటర్లో 41 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హెచ్ కేలూర్ రెండవ సెంటర్లో 52 మంది దరఖాస్తులు చేసుకోగా అదే గ్రామంలో ఒకటో సెంటర్లో 40 మంది దరఖాస్తులు చేసుకున్నారు. జుక్కల్ రెండవ సెంటర్లో 25 మంది దరఖాస్తులు చేసుకున్నారు పుల్కల్ రెండవ సెంటర్లో 41 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రూసేగావ్ సెంటర్లో 28 మంది దరఖాస్తులు చేసుకున్నారు. విట్టల్ వాడి సెంటర్లో 24 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విధంగా 25 పోస్టులకు గాను ఆయా గ్రామాల్లో పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాగా అన్ని సెంటర్లు కలిసి 500 దరఖాస్తులు వచ్చినట్లు సిడిపిఓ తెలిపారు. ఇక ఆయా పది పోస్టులకు గాను మొత్తం 45 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చింతల్ వాడి తాండా సెంటర్ కు ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన సెంటర్లలో రెండు, మూడు, 4, 6 ,7, ఈ విధంగా దరఖాస్తులు నమోదు అయ్యాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు పోటీ తత్వం చూస్తుంటే ఒక్క పోస్టుకు 60 మంది 50 మంది 40 మంది ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడం గమనహారం ఏ గ్రామంలో ఎవరెవరికి పోస్టులు వరిస్తాయో కానీ అంగన్వాడీ టీచర్ పోస్టులకు భర్తీ కోసం మహిళలు పోటీ పడుతున్నారు.



