Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎర్ర సత్యం సేవలు మరువలేనివి

ఎర్ర సత్యం సేవలు మరువలేనివి

- Advertisement -

మిడ్జిల్లో ఘనంగా వర్ధంతి వేడుకలు
నవతెలంగాణ-మిడ్జిల

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, దివంగత ప్రజా నాయకుడు ఎర్ర సత్యం మరాఠి సత్యనారాయణ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట, బుధవారం ముదిరాజ్ సంఘం, ఎర్ర సత్యం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర సత్యం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. జడ్చర్ల ఎమ్మెల్యేగా, ముదిరాజ్ బిడ్డగా ఆయన నిరుపేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎన్నో సేవలు చేశారని చెప్పారు. 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు. తక్కువ కాలం పదవిలో ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు.

1996 ఆగస్టు 11న జడ్చర్లలో జరిగిన ఒక కార్యక్రమంలో దుండగుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన పనులు ఇప్పటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు రవికుమార్ ముదిరాజ్, రాజేశ్వర్, పల్లె తిరుపతి ముదిరాజ్, కోల రాము ముదిరాజ్, ఎర్ర సత్యం అభిమానులు రాములు, బాలు, బుచ్చయ్య, గంజి కృష్ణ, శేఖర్ గౌడ్, కృష్ణ గౌడ్, రహీం సాయిబాబా ర శ్రీనివాస్ గుప్తా, హనుమంతు, భాస్కరాచారి , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -